16 July, 2026 | 9:50 AM

రాహుల్‌ది బాలక్ బుద్ధి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

04-07-2024 02:04 AM

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాం తి): రాహుల్ గాంధీలో పసితనం లక్షణా లు ఇంకా పోలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభలో విపక్ష నేతగా ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ప్రసంగ మంతా అబద్దాలేనని తెలిపారు. అగ్నివీర్, రైతుల అంశంపై, అయోధ్య పరిహారంపై ఎంపీల మైక్‌లను స్పీకర్ కట్ చేశారని రాహుల్ అబద్దాలు వల్లె వేశారని దుయ్యబట్టారు. గౌరవపదమైన స్పీకర్ పదవిని రాహుల్ అవమానించారని ధ్వజమెత్తారు.

రాహు ల్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రులు సమాధానం ఇస్తే ఇతర అంశాలను ఎత్తుకు న్నారని, బట్టకాల్చి మీద వేసేలా కాంగ్రెస్ నేత మనస్తత్వం ఉన్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తన పార్టీ ఎంపీలను వెల్‌లోకి వెళ్లమని ఆదేశించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. ఐదోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఇంకా సభా నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు. అందుకే మోదీ ప్రసంగంలో రాహుల్ పై బాలక్ బుద్ధిగా అభివర్ణించారని గుర్తుచేశారు. గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న వాజపేయ్, అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి నాయకులు ఎంతో హుందాగా వ్యవహరించారని, వారి నుంచైనా రాహుల్ గాంధీ నేర్చుకునాలని హితవుపలికారు.