calender_icon.png 24 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి

24-02-2026 12:00:00 AM

ఏఐ సమ్మిట్‌లో దేశ గౌరవాన్ని కాంగ్రెస్ అవమానించింది

బీజేపీ మహిళా మోర్చా నేతలు డాక్టర్ శిల్పారెడ్డి, డాక్టర్ పద్మ

హైదరాబాద్/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు ఎన్నికల ఇంచా ర్జి డాక్టర్ పద్మ వీరపనేని, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో దేశ గౌరవాన్ని, భారత ప్రతిష్టను తీవ్రంగా అవమానించేలా, దిగజార్చేలా కాంగ్రెస్ యూత్ నాయకులు చేశారని ఆగ్రహం వ్య క్తం చేసిశారు. అంతర్జాతీయ వేదికపై అర్ధనగ్న ప్రదర్శనను చేయడాన్ని బీజేపీ మహి ళా మోర్చా తీవ్రంగా ఖండించారు. ప్రపం చం భారత్‌ను టెక్నాలజీ లీడర్‌గా, ఏఐ హబ్ గా, నాలెడ్జ్ ఎకానమీగా గుర్తిస్తున్న సమయంలో ఈ విజయాన్ని జీర్ణించుకోలేక కాం గ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు దిగిందని వారు మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయాలకు వ్యతిరేకంగా సోమ వారం హైదరాబాద్‌లో ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ మహిళా మో ర్చా నాయకులు పాల్గొన్నారు.

దేశ గౌరవం, భారతీయ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కాంగ్రెస్ రాజకీయాలకు బుద్ధి చెబుతామని బీజేపీ మహిళా మోర్చా నేతలు హెచ్చరించారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను దిగజార్చినందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ పద్మ వీరపనేని మాట్లాడుతూ.. విదేశీ ప్రతినిధుల ముందు కాంగ్రెస్ నాయకులు అనాగరిక నిరసనలు చేపట్టడం కేవలం రాజకీయ వ్యతిరేకత మాత్రమే కాదని, ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమేనని అన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఉసిగొల్పుతున్న రా హుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.