calender_icon.png 24 February, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

24-02-2026 12:01:16 AM

కలెక్టర్ బీఎం సంతోష్ 

అలంపూర్, ఫిబ్రవరి 23: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి సర్పంచులు పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ మేరకు సోమవారం  ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్‌లో అయిజ, రాజోలి, అలంపూర్, ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు మండలాలకు చెందిన సర్పంచులకు 5 రోజుల పాటు నిర్వహించు శిక్షణ కార్యక్రమాన్ని  కలెక్టర్ బీఎం సంతోష్ హాజర య్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న అన్ని అంశాలను నూతనంగా ఎన్నికైన సర్పంచులు తెలుసుకుని అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పా టు గ్రామస్థాయిలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల వ్యవస్థలపై పూర్తి అవగాహన అవసరమన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్య, ఆరోగ్యం, తదితర ప్రధాన విషయాల్లో బాధ్యత వహించే అధికారులు, సిబ్బంది గురించి తెలుసుకొని తమ తమ గ్రామపం చాయతీలలో ఆయా వ్యవస్థలు సక్రమంగా పని చేసేందుకు సర్పం చులు బాధ్యత వహించాలన్నారు.

ప్రధానంగా పంచాయతీ కార్యద ర్శుల విధులు తెలుసుకొని, వారిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల  అభివృద్ధి లోముందుకెళ్లాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు పూర్తిస్థాయిలో సద్వి నియోగం చేసుకునేలా సర్పంచులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

ఐదు రోజులపాటు నిర్వహి స్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు ప్రతిరోజు పాల్గొని గ్రామ పాలనపై పట్టు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, బెటాలియన్ కమాం డెంట్ జయరాజు, నరేందర్ రెడ్డి, డిపిఓ శ్రీకాంత్, డిఎల్ పిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీ వోలు, శిక్షకులు పాల్గొ న్నారు.