calender_icon.png 1 September, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ నీచ రాజకీయం

31-08-2025 07:57:39 PM

రేగొండ,(విజయక్రాంతి): రాహుల్ గాంధీది చౌకబారు రాజకీయమని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిశిధర్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య అన్నారు. ఆదివారం వారు బిజెపి మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఆధ్వర్యంలో రేగొండ ప్రధాన రహదారిపై రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ప్రధాని నరేంద్ర మోది తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాహుల్ వ్యాఖ్యలు మహిళల పట్ల తనకున్న కుసంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని మోదీ తల్లి పైనే కాకుండా అందరి తల్లులను కించపరిచేలా ఉన్నాయని రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోదీకి, దేశ మహిళలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేస్తున్న నిరంకుశ పాలనను ఎండగడుతూ రాహుల్ గాంధీని దేశంలో ఎక్కడ తిరగనివ్వమని హెచ్చరించారు.