31-08-2025 08:01:53 PM
జిల్లా వ్యాప్తంగా 2-3 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా వచ్చే 2-3 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఏదైనా ప్రాంతంలో మూడు గంటలకు పైగా వర్షం నిరంతరంగా కురిస్తే లేదా 100 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే అక్కడి పరిస్థితులను పరిశీలించి వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి, ఆహారం, తాగునీరు మరియు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ ను సంప్రదించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: 08744-241950, 08744-241951.