01-09-2025 12:06:26 AM
సిద్దిపేట, ఆగస్టు 31 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లాకు 2 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు, 1 కాంస్య పతకం చొప్పున మొత్తం 5 పతకాలు సాధించారని సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్, కర్రోళ్ల వెంకటస్వామి గౌడ్ లు తెలిపారు.
గణేష్ (రేస్ వాక్), పవర్ నగేష్ (జావలిన్ త్రో), ఉదయ్ కిరణ్ (హై జంప్), సిరి చందన (జావలిన్ త్రో), దాన్య ( జావలిన్ త్రో)లు పథకాలు సాధించారు. జిల్లా జట్టు కోచ్ మేనేజర్లు లీలా ఆనంద్, లక్ష్మణ్, పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా యువజన స్పోరట్స్ అధికారి వెంకట నరసయ్య, సిద్దిపేట స్పోరట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, ఎస్.జి.ఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి పన్యాల రామేశ్వర్ రెడ్డి, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు, టిజీపేట జిల్లా అధ్యక్షులు ఏర్వ అశోక్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కడకంచి ఉప్పలయ్య, జిల్లా వాలిబాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి రవీందర్ రెడ్డి , శిక్షకులు నిశాంక్ గౌడ్, ప్రభాకర్, ప్రేమలతలు అభినందించారు.