15 April, 2026 | 7:58 AM

నకిలీ సంతోష్ దాబాలపై దాడులు

03-11-2025 03:19 AM

కాపీరైట్ ఉల్లంఘించిన ఏడు షాపులపై చర్యలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు గోషామహల్, అబిడ్స్ పోలీసుల నేతృత్వంలో ఆదివారం నకిలీ సంతోష్ దాబాలపై చర్యలు తీసుకున్నారని న్యాయవా ది అభిషేక్ అగర్వాల్, సంతోష్ దాబా యజమాని మనోజ్‌కుమార్ సంఖ్లా తెలిపారు. సంతోష్ దాబా భాగస్వామి మనోజ్ కుమార్ సంఖ్లా తన న్యాయవాది అభిషేక్ అగర్వాల్ ద్వారా తన రిజిస్టర్డ్ ట్రేడ్ పేరును ఉపయోగించి నగరంలో వివిధ సంస్థలు పనిచేస్తున్నా యని ఆరోపిస్తూ సిటీ సివిల్ కోర్టులో పిల్ వేశారని అడ్వకేట్స్ కమిషన్ బి సాయినాథ్ నివేదించింది.

కేసును విచారించిన తర్వాత సిటీ సివిల్ కోర్టుకు చెందిన 11వ అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆర్ డానీ రూత్ ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నవంబర్ 3 నాటికి ఈ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించినట్లు తెలిపారు. దీంతో సంతోష్ దాబా పేరుతో పనిచేస్తున్న రెస్టారెంట్ల సైన్‌బోర్డులను తొలగించడంతో పాటు, సంతోష్ దాబా పేరుతో ము ద్రించిన పత్రాలు, ఇతర ఉల్లంఘన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. పశ్చిమ మారేడ్‌పల్లిలోని సంతోష్ దాబా పేరుతో నడుస్తున్న రెస్టారెంట్‌ను వినోద్ కుమార్ భాటి నిర్వహిస్తున్నారు.

వందేమాతరం స్కూల్ బేగం బజార్ సమీపంలో నరేష్ కుమార్ సంఖ్లా నిర్వహిస్తున్న న్యూ సంతోష్ దాబా, అదే ప్రాంతంలో ఆనంద్ సంఖ్లా, అబిడ్స్ సమీపంలో దినేష్ సంఖ్లా నడుపుతున్న సంతోష్ దాబా జష్న్, అదే ప్రాంతంలో సురేష్ కుమార్ సంఖ్లా నడుపుతున్న న్యూ సంతోష్ దాబా, అత్తాపూర్‌లోని పిల్లర్ 117 సమీపంలో సందీప్ భాటి నడుపుతున్న అస లు సంతోష్ దాబా, సికింద్రాబాద్లోని ఎంజి రోడ్లోని జైన్ మందిర్ సమీపంలో వినోద్ భాటి నడుపుతున్న న్యూ సంతోష్ దాబాపై చర్యలు తీసుకుంటూ బోర్డులను తొలగించారు. భవిష్యత్తులో కూడా, నగరంలో ఇంకా మిగిలి ఉన్న సంతోష్ దావాల పేర్లపై చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు.