17 April, 2026 | 4:31 PM

డబ్బులిస్తానని పిలిచి.. వడ్డీ వ్యాపారిని చంపిన రైల్వే ఉద్యోగి

28-06-2025 10:27 AM

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. కాజీపేట రైల్వే క్వార్టర్స్(Kazipet Railway Quarters) వద్ద వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ ను రైల్వే ఉద్యోగి(Railway Employee) ప్రవీణ్ కుమార్ దారణంగా కొట్టి చంపాడు. డబ్బులు ఇస్తానని వడ్డీ వ్యాపారిని పిలిచిన ప్రవీణ్ కుమార్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. నవీన్ కుమార్ ను చంపిన సమయంలో ప్రవీణ్ కుమార్ తో పాటు, అతని ప్రియురాలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.