12 March, 2026 | 2:30 PM

Breaking News

మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •   గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం   •  

ఎల్ఈడి టీవీలను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

27-10-2024 01:43 PM

నిద్రిస్తున్న వ్యక్తి వద్ద ఉన్న టీవీలను చోరీ చేసిన ఘనుడు

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రెండు ఎల్ఈడి టీవీలను పక్కన పెట్టుకొని పడుకోగా మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి ఆ రెండు ఎల్ఈడి టీవీలను చోరీ చేసుకొని వెళ్ళాడు. బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మహారాష్ట్ర లోని కిన్వాట్ కు చెందిన శంకర్ నాగురావును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ధర్మబాదుకు చెందిన మాదప్ప ఈనెల 26న శనివారం 32 ఇంచుల రెండు ఎల్ఈడి టీవీలను కొనుగోలు చేసి ధర్మాబాద్ వెళ్లేందుకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చాడు.

అప్పటికే ట్రైన్ వెళ్లిపోవడంతో బుకింగ్ కౌంటర్ వద్ద రెండు టీవీలను పక్కన పెట్టుకుని నిద్రించాడు. మాదప్ప పక్కన ఉన్న టీవీలను చూసిన మహారాష్ట్రలోని కిన్వాట్ కు చెందిన శంకర్ నాగురావ్ రెండు ఎల్ఈడి టీవీలను ఎత్తుకొని వెళ్లిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం ఒకటవ ఫ్లాట్ ఫామ్ లో ఎల్ఈడి టీవీలను నాగు రావు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో రైల్వే పోలీసులు పట్టుకొని విచారించారు. రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ సమీపంలో ఓ వ్యక్తి తన పక్కన రెండు ఎల్ఈడి టీవీలను పెట్టుకొని నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు, అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ సుబ్బారెడ్డి, ఏఎస్ఐ ప్రవీణ్ పాల్గోన్నారు.