17-05-2025 01:11:15 AM
ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు తగ్గే అవకాశం
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో చాలా చోట్ల రాబోయే 5 రోజులు ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిం చి దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాతంలోని మరిన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన చక్రం ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనే క జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జి ల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సైతం చల్లబడనున్నాయి. 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.