calender_icon.png 18 May, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల బెడద నుంచి ప్రజలకు పూర్తిగా విముక్తి కలిగిస్తా

17-05-2025 01:12:06 AM

  1. సొంత ఖర్చులతో ఏడు నెలల్లో 2,300 కోతుల పట్టివేత 

మహబూబాబాద్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కొమ్మాలు నాయక్ 

గూడూరు.మే 16: (విజయ క్రాంతి) గూడూరు ప్రజలకు కోతుల బెడద నుండి పూర్తిగా విముక్తి కలిగిస్తానని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి కోతులను పూర్తిస్థాయిలో నిర్మూలించి ప్రజలకు వాటి నుండి విముక్తిని కలిగిస్తానని,

గతంలో గూడూరు పట్టణ కేంద్రంలో ఇండ్లలో అదేవిధంగా వ్యాపార సముదాయాల్లో అందరూ డోర్లు వేసుకొని ఉండేవారని అయితే సుమారు 2,300 కోతులను సొంత ఖర్చులతో పట్టించడం ద్వారా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్నారు. కాగా గతంలో రాక్షసుల ద్వారా ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారని అయితే గత కొన్ని రోజులుగా అడవులు నివాసంగా చేసుకుని బ్రతికే కోతులు గ్రామాల్లోకి ఇండ్లలో రావడం ద్వారా ప్రజలు భయోందోలనకు గురవుతున్నారనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో కోతులను పట్టించడం జరిగిందన్నారు.

అదేవిధంగా తనకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీపాల్ రెడ్డి ఇంకా మరికొందరు నాయకులు తనకండగా ఉంటూ నన్ను ప్రోత్సహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో కోతులు గూడూరు మండల కేంద్రంలో ఎక్కడ కూడా కనిపించకుండా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తున్నానని ఆయన తెలిపారు. గూడూరులో కోతుల నిర్మూలనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కొమ్మాలు నాయక్ సేవలో అమోఘమని తహసిల్దార్, ఎంపీడీవో ఇతర శాఖల అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.