మూడు రోజులు వానలు
17-08-2026 01:51 AM
30 కి.మీ వేగంతో ఉపరితల గాలులు
హైదరాబాద్, ఆగస్టు 16 ( విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తామని తెలంగాణ తావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి బుధవా రం వరకు అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని, గంటలకు 30- 40కిలో మీటర్ల వేగంతో బల మైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆదివారం వరంగల్, భ ద్రాద్రి కొత్తగూడెం, హన్మకొం డ, రాజన్నసిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, నిజామా బాద్, ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాల్లో తేలికపాటి, మిగి తా జిల్లాల్లో అతి తేలికపాటి వ ర్షాలు నమోదయ్యాయి.






