12 March, 2026 | 8:55 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నగరంలో వర్షం

15-10-2024 12:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నగరంలో సోమవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, ప్రగతినగర్, పటాన్‌చెరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్లపోచంపల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది.

గాజుల రామారంలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, పటాన్‌చెరు ఆర్‌సీ పురంలో 2.1 సెం.మీ, కూకట్‌పల్లిలో 1.5 సెం.మీ వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో సెం.మీ కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. కాగా, వాతావరణ శాఖ సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.