calender_icon.png 19 June, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల కడగండ్లు

01-09-2024 12:00:00 AM

గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలతో పాటుగా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా రవాణా సదు పాయాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి.  వరి చేలతో పాటుగా ఇతర వాణిజ్య పంట పొలాలు సైతం నీట మునిగి పోవడంతో ఇంతకాలం పడిన కష్టమంతా నీటి పాలవుతోంది. మరో మూడు, నాలుగు రోజులు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోం ది. రైతుల ఆవేదన అలా ఉంటే మిగతా ప్రజల బాధలు వర్ణనా తీతం. ఇప్పటికే విష జ్వరాలతో పల్లెలు, పట్టణాలు పడకేశాయి. వందలాది మంది రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

అయితే భారీ వర్షాల కారణంగా రోగులు ఆస్పత్రులకు వెళ్లడానికి కానీ, వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలకు రావడానికి కానీ వీలు లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జ్వర బాధితుల పరిస్థితి ఏమిటనేది అర్థం కానిదుస్థితి. ప్రభుత్వం ఈ దిశగా ఆలో చించి గ్రామాలకు అత్యవసరంగా వైద్య సిబ్బందిని పంపించి వారి కి అక్కడే చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. మరో వైపు గురుకులాలు, ఇతర ఆశ్రమ  పాఠశాలల హాసళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా డజన్ల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న వార్తలు నిత్యం వస్తున్నాయి. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్య పరిస్థితి గురించి  అంత శ్రద్ధ చూపించడం లేదనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. 

 సురేశ్ బాబు,  ములుగు