calender_icon.png 23 August, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్‌ను విడువని వాన

19-08-2025 01:53:33 AM

  1. నీట మునిగిన పంట పొలాలు 
  2. కామారెడ్డి జిల్లా షెట్లుర్ వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరులు, గొర్రెలు 
  3. ఒడ్డుకు చేర్చిన ఎన్‌డీఎస్ బలగాలు 

కామారెడ్డి, ఆగస్టు 18 (విజయక్రాంతి): గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లుర్ వద్ద వాగులో నలుగురు గొర్రెల కాపరులు, ఇద్దరు రైతులు, 500కు పైగా గొర్రెలు చిక్కుకున్నాయి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్థానిక అధికారులకు, కలెకర్‌కు సమాచారం అందించడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎస్ బృందాల సాయంతో గొర్రెల కాపరులను, రైతులను, గొర్రెలను రక్షించారు.

బాన్సువాడ గాంధారి రహదారిపై సర్వాపూర్ వద్ద ప్రవహిస్తున్న నీటితో రాకపోకలు నిలిచిపోయాయి. గాంధారి లింగంపేట్ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి గ్రామాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జుక్కల్ నియో జకవర్గంలో బిచ్కుంద, మద్నూర్, మహమ్మద్‌నగర్ మండలాల పరిధిలోని గ్రామా ల్లో పలుచోట్ల వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు నష్టపరిహారం అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువానుకు కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండి జల కలను సంతరించుకున్నాయి.