19-08-2025 01:54:03 AM
ముంపునకు ‘హైడ్రా’ పరిష్కారం
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 18 (విజయక్రాంతి): అమీర్‌పేట మైత్రివనం వద్ద వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా హైడ్రా కార్యాచరణను ముమ్మరం చేసింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర ద కృష్ణాకాంత్ పార్కు చెరువులోకి మళ్లించడం ద్వారా సమస్యను అదుపు చేయవచ్చ ని ప్రాథమికంగా నిర్ధారించింది. సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కులోని చెరువును ఒక హోల్డింగ్ రిజర్వాయర్’గా వినియోగించుకోవాలని కమిషనర్ రంగనాథ్ భావించారు. 120 మిలియన్ లీటర్ల వరద నీటిని కొన్ని గంటల పాటు ఇక్కడ నిల్వ చేయవచ్చు.