హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం వేకువజామున భారీ వర్షం(HyderabadRain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు నిండిపోయాయి. దీంతో రాకపోకలను అంతరాయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయ(Karmanghat Anjaneya Swamy Temple) ప్రాంగణంలోకి నీరు చేరింది. భారీ వర్షాల తర్వాత హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్, రోజువారీ జీవితం ప్రభావితమయ్యాయి. పరిస్థితిని నిర్వహించడానికి జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) బృందాలను నియమించారు.
బుధవారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాలలో జోరుగా వాన కురిసింది. రాత్రిపూట నగరంలోని కొన్ని ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పగటిపూట చాలా వరకు మేఘావృతమై ఉన్నప్పటికీ, వర్షాలు కురవలేదు కానీ అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. నగరంలో అత్యధిక వర్షపాతం పశ్చిమ ప్రాంతాలలోనే నమోదైంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయ పరిసరాల్లో(Near Hyderabad University) 148.5 మి.మీ వర్షపాతం నమోదైంది. తరువాత ఎంఎంటిఎస్ లింగంపల్లిలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది. చందానగర్‌లో కూడా 109.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సమీప ప్రాంతాలలో కూడా మంచి వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 81.3 మి.మీ, మియాపూర్‌లో 46.3 మి.మీ, బిహెచ్‌ఇఎల్‌లో 26.3 మి.మీ, కెపిహెచ్‌బిలో 23.3 మి.మీ, రాజేంద్రనగర్‌లో 19.3 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు.






