2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

వానాకాలం.. ఆర్‌అండ్‌బీ అప్రమత్తం

19-06-2025 01:04 AM
  1. క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలి
  2. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): వానాకాలం ప్రారంభమైన నేపథ్యం లో ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్ర స్థాయి లో అప్రమత్తంగా ఉండాలని రో డ్లు, భ వనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. బుధవారం హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబా టులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉధృతంగా ప్రవహించే నదులు వాగులు వద్ద బ్రిడ్జిలు, కల్వర్ట్‌పై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అం దుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి రాష్ర్ట ప్ర ధాన కార్యాలయ కంట్రోల్ సెంటర్‌కు అ నుసంధానం చేయాలని సూచించారు.

గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూ డ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో యు ద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్‌లపై అధికారులను ఆరా తీశా రు. రాష్ర్టవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ స్టేట్ రో డ్స్‌కు సంబంధించి మొత్తం 1,214 గుంత లు ఏర్పడి 2,488 కి.మీ. రోడ్డు పాక్షికంగా దెబ్బతిందని, 2,186 కి.మీ. రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యాయని, ఇంకా 302 కి.మీ. రోడ్డు మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటి ప్రోగ్రెస్‌తో పా టు వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘మంచి రో డ్లు-అభివృద్ధికి చిహ్నాలు’ నినాదంతో ముందుకెళ్లాలని, జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.