2 July, 2026 | 1:20 AM

బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

01-07-2025 01:22 AM
  1. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ
  2. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనివ్వకపోవటంతో ఆవేదన

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): చాలారోజులుగా బీజేపీపై బాహా టంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వచ్చిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, చివరకు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలోనే ఆయన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీకో దండం..

మీ పార్టీకో దండమని బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డికి లవ్‌లెటర్ ఇచ్చేశానం టూ రాజీనామా లేఖపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్ట అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే.. తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈక్రమంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కిషన్‌రెడ్డికి చెప్పి.. లేఖ రాశానన్నారు. ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు పడేలా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ పంపమని కోరినట్టు వెల్లడించారు. 2014 నుంచి తాను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. టెర్రరిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నానని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారని..

ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తన నామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు సిద్ధమైన పార్టీ కౌన్సిల్ మెంబర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ బెదిరించారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని, కానీ పోటీ చేసేందుకు అవకాశ మే ఇవ్వలేదన్నారు.

కిషన్‌రెడ్డి చేతుల మీదుగానే పార్టీలో చేరానని.. ఆయనకే రాజీనామా లేఖ అందించి వెళ్లిపోతున్నట్టు తెలిపారు. రాజాసింగ్‌ను బుజ్జగించేందుకు కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ ప్రయత్నించినా రాజీనామా చేయడంపై మరో ఆలోచన లేదని చెప్పినట్టు తెలుస్తోంది.