14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం రాజనాల శ్రీహరి దరఖాస్తు

22-10-2025 12:36 AM

వరంగల్, అక్టోబర్ 21 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడి గా బీసీ నేత, విద్యావంతుడు, సీనియర్ రాజకీయ నేత రాజనాల శ్రీహరికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ కు దరఖాస్తు సమర్పించారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లో అనుభవం ఉన్న నాయకుడు, అందరితో కలుపుగోలుగా ఉండి, పార్టీ కార్యకర్తల కు వెన్నుదన్నుగా ఉండే నాయకుడే అధ్యక్షుడుగా కావాలని కార్యకర్తలు, శ్రీహరి అభి మానులు కోరుకుంటున్నారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో బీసీ కులాల అన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయం చేసే సత్తా ఉన్న ఏకైక సీనియర్ నాయకుడు గా రాజనాల శ్రీహరి కి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 35 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగి, అనేకమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా పేరుపొందాడు.1989 నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ,1996లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది.

పేద ప్రజలకు నిత్యం ఏదో రూపంలో ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తిగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మంచి సలహాదారు నీగా, అనేక విషయాల్లో చేదోడువాదోడుగా పనిచేశాడు. ప్రస్తుత టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచరుడుగా, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా పేరు పొందిన రాజనాల శ్రీహరికి డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమయంలో బీసీ నేత రాజనాల శ్రీహరికి డీసీసీ పదవి ఇచ్చి బీసీ కులస్తుల కు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులుభావిస్తున్నారు.