22-10-2025 12:37:41 AM
-నాగారంలో ఉద్రిక్తత..
- పంచాయతీ కార్యదర్శిపై చర్య తీసుకోవాలని గ్రామస్థులు, ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఆగ్రహం.
-తహసీల్దార్‌కు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేత
కోనరావుపేట అక్టోబర్ 21 (విజయక్రాంతి):కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో దీపావళి పర్వదినాన చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర చర్చనీయాంశం గా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అప్సాన ఆదేశాల మేరకు, గ్రా మంలోని పొట్టిగుట్టపై ఆర్.ఎస్.ఎస్. వాలంటీర్లు ఏర్పాటు చేసిన కాషాయ జెండాను (భగవజ్జండా) అనుమతి లేకుండా తొలగించారంటూ గ్రామస్థులు, స్థానిక యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, హిందుత్వ భావోద్వేగాలకు, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా భావించే కాషాయ జెండాను పవిత్రమైన దీపావళి పండుగ రోజున తొలగించడం జాతీయ సాంస్కృతిక సంప్రదాయాలను అవమానించడమేనని పలువురు యువకులు, సంఘపరులు పేర్కొంటున్నారు. ఈ చర్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్థులు, నిరసన తెలిపారు. తాము ఎలాంటి అనుమతులు లేకుండా జెండాను ఏర్పాటు చేయలేదని, దీన్ని తొలగించడం భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనని ఆర్‌ఎస్‌ఎస్ వాలం టీర్లు వాపోతున్నారు.
కార్యదర్శిపై చర్య తీసుకోవాలని డిమాండ్..
ఈ వివాదాస్పద చర్యకు బాధ్యురాలైన పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అప్సానపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకో వాలని గ్రామస్థులు, స్థానిక యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేయడం జరిగిందని వారు తెలిపారు.