12 July, 2026 | 2:50 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

రాజన్న ఆలయ విస్తరణకు ఓకే

29-04-2025 12:35 AM

వేములవాడ, ఏప్రిల్ 2౮: రాష్ర్టంలోనే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి  ఆలయ విస్తరణ పనులకు శృంగేరి పీఠాధిపతులు  అనుమతులు  ఇచ్చారని  ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.  ఆలయ విస్తరణ, అభివృద్ధిలో భాగంగా   ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,  రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, సలహాదారు గోవిందాహరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి బృందం ఆదివారం  శృంగేరికి తరలివెళ్లారు. 

శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ స్వామితో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు ఈఓ వెల్లడించారు. ఆలయవిస్తరణ నమూనాలు, పూజా విధానాలు, భక్తుల దర్శనాలపై మాట్లాడినట్టు తెలిపారు. విస్తరణ పనులు సాగే క్రమంలో శ్రీరాజరాజేశ్వరస్వామికి నిత్యం నిర్వ హించే పూజా కార్యక్రమాలు యథావిధిగా ఏకాంతంగా దేవాలయ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవల ఏర్పాట్లు భీమేశ్వర ఆలయంలో చేయాలని తెలిపినట్లు వివరించారు. త్వరలోనే ఆలయ విస్తరణపై టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.