calender_icon.png 2 May, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

29-04-2025 12:36:21 AM

అదనపు కలెక్టర్ నగేశ్

మెదక్, ఏప్రిల్ 28(విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ అధికారులకు తెలియజేసి, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు రూపొందించిన  ప్రజాసంబంధ కార్యక్రమమని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.

సోమవారం ఐడిఓసి కార్యాల యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 58 దరఖాస్తులు వచ్చాయని అందులో భూభారతి 14, ఎంప్లాయిమెంట్ 4, ఇందిరమ్మ ఇండ్లు 6, పెన్షన్ 1, ఇతర సమస్యలు 33 ఆర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.