రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం పొందిన రాజాపూర్ ఉపాధ్యాయులు
మహబూబ్ నగర్ ఆగస్టు 4 (విజయక్రాంతి): రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా రాజాపూర్ మండలంలో పనిచేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 100 మంది రెడ్ క్రాస్ సొసైటీలో మంగళవారం సభ్యత్వం తీసుకున్నట్లు రాజాపూర్ సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. సొసైటీలో చేరేవారు సమ్మతి పత్రం, రూ.250 లతో సొసైటీలో చేరారు. సభ్యత్వ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ డీఈవో విజయ కుమరి చేతుల మీదుగా ఉపాధ్యాయులు పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనం కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సామాజిక సేవ చేసేందుకు రెడ్ క్రాస్ సొసైటీల చేరడం అర్శించదగ్గ విషయమని అన్నారు. ఉపాధ్యాయులందరూ సేవ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్, ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఎల్లయ్య, రవికుమార్ మోహన్ కుమార్, వెంకటేశ్వర శెట్టి దివాకర్ రాజ్, జయవర్ధన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నజీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.






