ఇవాళ ప్రియాంక దత్ పుట్టిన రోజు
19-12-2024 12:00 AM
ఇవాళ ప్రియాంక దత్ పుట్టిన రోజు. ఆమె 1984 డిసెంబర్ 19న విజయవాడలో జన్మించారు. ఆమె ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చల సాని అశ్వనీదత్ కుమార్తె కావడంతో స్వతహాగానే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ‘బాలు’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రియాంక అడుగు పెట్టారు. ఈ చిత్రానికి ఆమె సహ నిర్మాతగా వ్యవహరించారు. అనంతరం త్రి ఏంజల్స్ స్టూడియోను స్థాపించారు. 2013లో తొలిసారిగా ఆమె నిర్మాతగా ‘యాదోం కి బారాత్’ చిత్రాన్ని నిర్మించారు.






