calender_icon.png 25 October, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో 100% మా ప్యానలే గెలుస్తుంది..

25-10-2025 07:55:49 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్, జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు సభ్యుల సహకారంతో 100% తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం వెలిచాల ప్రజా కార్యాలయంలో అర్బన్ బ్యాంకు ప్యానెల్ అభ్యర్థులతో కలిసి రాజేందర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్యానెల్ అభ్యర్థులు మంచి అనుభవం మంచి ఆశయం ఆలోచన కలిగిన వారు అని పేర్కొన్నారు. విజయం సాధించిన తర్వాత అర్బన్ బ్యాంకును అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన నీతిమంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. 

ప్రస్తుతం అర్బన్ బ్యాంకులో 92 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తమ ప్యానల్ గెలిస్తే ఈ డిపాజిట్లను మూడింతలుగా అయ్యేలా చేస్తామన్నారు. హుస్నాబాద్ చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంటలో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కరీంనగర్ అర్బన్ బ్యాంకు ప్యానల్ డైరెక్టర్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశామని, పానల్ డైరెక్టర్లకు మంత్రులు విప్ ప్రత్యేక ఆశీర్వాదం.. ఆశీస్సులు అందజేశారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్ కుమార్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.