calender_icon.png 25 October, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎంఈఓ

25-10-2025 07:57:41 PM

మఠంపల్లి: ఉన్నత శిఖరాలకు అధిరోహించాలంటే విద్యార్థులు కష్టపడి చదవడం తప్ప వేరే మార్గం లేదని సాగర్ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణ మూర్తి చెప్పారు. శనివారం మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ ఆడిటోరియం క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉన్న పది ప్రభుత్వ పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉత్తీర్ణులై అధిక మార్కులు తెచ్చుకొని మొదటి ముడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు మేమేంటోలను అందజేశారు.

ఈ సందర్భంగా 10వ తరగతి లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు వరుసగా మొదటి ర్యాంక్ విద్యార్థికి రూ.20 వేలు, రెండవ ర్యాంక్ విద్యార్థికి రూ.15 వేలు,మూడవ ర్యాంక్ విద్యార్థికి రూ.10 వేల చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి వెంకటచారి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే చదువుతుంటారని చదువులో మంచి ర్యాంకులు సాధించిన వారికి సాగర్ సిమెంట్ పరిశ్రమ వారు ఆర్థిక సహకారం అందించడం వలన విద్యార్థులు ఉన్నత విద్య చదవటానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.