calender_icon.png 25 October, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

25-10-2025 07:53:26 PM

తూప్రాన్,(విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్‌ లో వరి కొనుగోలు కార్యక్రమంపై తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి జయచంద్ర రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జిపిఒలు, ఏపిఎంల, సిసి‌లు, ఓబీలకు ప్రత్యేకంగా శిక్షణతో పాటు సలహాలను అందించారు. ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, అవసరాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా, ప్రామాణిక ధరలకు వరి విక్రయించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు ఆలస్యం లేకుండా, రైతులను పూర్తిగా ఆదుకోవాలని అందరికీ స్పష్టం చేశారు. తూప్రాన్ మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆర్డీవో ఆదేశించారు.