22-05-2025 12:00:00 AM
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, మే 21: దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రా మంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మర వలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి నాయకులు బీక్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీ చ్యా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాల్ రాజ్, సింగల్ విండో డైరక్టర్ వెంకటేష్, నాయకులు శ్రీనివాస్, పర్వతాలు, ఇక్బల్ పాషా, చెన్నయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.