calender_icon.png 22 May, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల, కర్షకుల, పేదల వారికి అండగా నిలిచేది కమ్యూనిస్టులే

21-05-2025 11:34:48 PM

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్..

మునగాల: కార్మికుల కర్షకుల మధ్యతరగతి జీవులకు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనాని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నా చంద్రశేఖర్(CPI state executive member Kanna Chandrasekhar) అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో జరిగిన మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చట్ట సభల్లో సీట్లు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్య నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని ఉన్నారు. మునగాల పరగానాలు భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనలో వ్యతిరేకంగా పోరాటాలు చేసిన గడ్డ మునగాలని అన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ సమగ్రతకు సమైక్యతకు కమ్యూనిస్టులు అంకితమై పని చేస్తున్నారని ఎలాంటి ప్రతిఫలక్ష లేకుండా పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు నుండే సిపిఐ 100 సంవత్సరాలుగా సజీవంగా ఉందని అన్నారు. అంతకుముందు సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జెండాను ఎగరవేశారు. సిపిఐ మండల కార్యదర్శిగా చిలంచర్ల ప్రభాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ కృషి చేస్తానని, గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు వేసి పార్టీ మరింత పుంజుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాఘవరెడ్డి శ్రీనివాస్ సాలె రవి శివా నాయక్ ప్రజాసంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.