21 May, 2026 | 3:29 PM

Breaking News

తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రథాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...

21-05-2026 02:53 PM

పాల్గొన్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్...

బాన్సువాడ, మే 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు.

రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. “సమైక్యతే మన శక్తి – శాంతియుత భారతమే మన లక్ష్యం” అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కాసుల బాలరాజు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమములో  మాజీ  జెడ్పి  కోప్షన్  సభ్యులు  , అలీ బిన్  అబ్దులా  ,  బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షులు  అసద్  ,జిల్లా  యువజన  అధ్యక్షులు  మధు సుధన్  ,గురు  వినయ్ , నార్ల సురేష్ , ఎజాస్,కౌన్సిలర్లు  , హకీమ్  , రాజశేఖర్  , రమేష్  , కమ్రు  , నియోజక  వర్గ  అధ్యక్షులు  మన్సూర్  ,రవీందర్  రెడ్డి ,కో ఆప్షన్  సభ్యులు  , మజ్జు  , సుల్తానా  గౌస్  రేంజర్ల  సాయిలు,రవీందర్  రెడ్డి, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.