calender_icon.png 3 December, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొత్తం ఖర్చు దేశ ప్రజలే భరించారు

03-12-2025 09:12:10 AM

వడోదర: గుజరాత్ వడోదరలో జరిగిన 'సర్దార్ సభ'లో(Sardar Sabha) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Defence minister Rajnath Singh) ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా లౌకికవాది. బాబ్రీ మసీదు సమస్యపై ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం గురించి జవహర్‌లాల్ నెహ్రూ మాట్లాడినప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దానిని వ్యతిరేకించారు. ఆ సమయంలో, బాబ్రీ మసీదును ప్రభుత్వ డబ్బుతో నిర్మించడానికి ఆయన అనుమతించలేదు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి నెహ్రూ జీ ప్రశ్న లేవనెత్తారు. సోమనాథ్ ఆలయ కేసు భిన్నంగా ఉందని సర్దార్ స్పష్టం చేశారు. ప్రజలు అక్కడ రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు, ఒక ట్రస్ట్ ఏర్పడింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ము పైసా కూడా వాడలేదు. అయోధ్యలోని రామమందిరానికి ప్రభుత్వ డబ్బుతో నిధులు సమకూర్చలేదు. మొత్తం ఖర్చును ఈ దేశ ప్రజలే భరించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) అవినీతి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. మంత్రి పదవితో సంబంధం లేకుండా ఏ మంత్రిపైనైనా ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేయాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఆరోపణలు నిజమని తేలితే, ఆ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరికను స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా బీజేపీ గౌరవించింది. రాజ్యాంగంలోని 130వ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని కూడా మేము నిర్ణయించుకున్నాము. ఒక పదవిలో ఉన్న వ్యక్తి 30 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే, అతను తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని భారత పార్లమెంటులో ఆమోదించడానికి మేము ప్రయత్నిస్తున్నామని రాజ్‌నాథ్ తెలిపారు.