calender_icon.png 30 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

30-12-2025 12:01:53 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వద్దిరాజు రవిచంద్ర సోదరులు కిషన్, దేవేందర్, వెంకటేశ్వర్లు తోపాటు సోదరీమణులు బంధుమిత్రులతో కలిసి శ్రీవారిని బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో, శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని, అలాగే కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు.