22 June, 2026 | 2:28 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో రాజ్యశ్యామల దేవి హోమం

18-11-2025 05:25 PM

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నేడు భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చిత్రాన్ని ముగ్గుతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాటా సుధ శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా, మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, శశిధర్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించడం పుణ్యకరమైన కార్యం. గురువుల సూచనల ప్రకారం ఈ దేవత భక్తుల కోరికలను శీఘ్రంగా తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో హోమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాం అని తెలిపారు. మంగళవారం రోజు మాస శివరాత్రి ఉండటంతో ఈ హోమానికి మరింత ప్రాధాన్యం చేకూరిందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.