18-11-2025 05:23:50 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): బీసీ వర్గాల సాధికారత, సంఘటిత బలం పెంపుపై దృష్టి సారిస్తూ పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి సుల్తానాబాద్ మండల బీసీ జేఏసీ కన్వీనర్‌గా బొంకూరి ఐలయ్య యాదవ్‌ను నియమించారు. ఈ సందర్భంగా బొంకూరి ఐలయ్య మాట్లాడుతూ మండలంలోని బీసీ సమాజ సమస్యలను గుర్తించి, పరిష్కార దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా అన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేటట్లు జేఏసీ వేదికగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.
గ్రామాల వారీగా బీసీ కుటుంబాల సమస్యలను సేకరించి, సంబంధిత విభాగాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.బీసీ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యా రంగంలో మార్గదర్శకత, సామాజిక న్యాయం సాధన ఇవే నా ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.తన నియామకానికి సహరించిన చైర్మన్ దాసరి ఉషకు కృతజ్ఞతలు తెలుపుతూ మండల బీసీ జేఏసీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, సంఘఐక్యతతో ముందుకు తీసుకెళ్లే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ కు పలువురు అభినందనలు తెలిపి, హర్షం వెలిబుచ్చారు.