10-08-2025 01:32:50 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : రాఖీ పండుగ ఆత్మీయతకు ప్రతీక అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేర కు శనివారం భోలక్‌పూర్‌లోని పహాడి మసీ దు వద్ద డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరా వు ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ముస్లీం మహిళలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ...హిందూ, ముస్లీంలు పండుగను ఐక్యం గా జరుపుకుంటూ మతసామరస్యాన్ని పెం పొందిస్తున్నారన్నారు. పండుగలను ఘనం గా జరుపుకుంటూ మన సాంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలుపాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నేత ముఠా జైసింహా, మైనార్టీ కమిటీ రాష్ట్ర నాయకులు, రహీం, జునేద్ బాగ్దాదీ, డివిజన్ మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మగ్బూ ల్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షులు శంకర్‌గౌడ్, గోవింద్‌రాజ్, మీ డియా సెల్‌ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.