10-08-2025 01:31:30 AM
వారసిగూడ, ఆగస్టు 9 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూ టీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసం లో శనివారం రక్షా బంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి.
పద్మారావు గౌడ్ సోద రీమణి శ్రీమతి శకుంతలతో పాటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ రక్షా బం ధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల సౌభాతృత్వానికి రక్షా బంధన వేడు కలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.