10-08-2025 01:34:24 AM
శిశువిహార్ పిల్లలకు రాఖీలు కట్టి స్వీట్స్ అందజేసిన కలెక్టర్ హరిచందన దాసరి
హైదరాబాద్, సిటీబ్యూరో ఆగస్టు 9 (విజయక్రాంతి): రక్షాబంధన్ సందర్భంగా కలె క్టర్ హరిచందన దాసరి శనివారం శిశు విహా ర్ సందర్శించి పిల్లలందరికీ రాఖీలు కట్టి స్వీట్లు చాక్లెట్లుతో పాటు డ్రాయింగ్ పుస్తకాలు అందచేసి రాఖీ పండుగ శుభాకాం క్ష లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా పిల్లలందరికీ సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంతో పాటు ఆట వస్తువులతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని అన్నారు. త్వరలో ఆరు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు జూ పార్క్ చూపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.
ముఖ్యాంగా శారీరక మానసిక వికలాంగుల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తదుపరి పిల్లలతో మమేకమైన కలెక్టర్ వివిధ దేశాలకు సంబంధించిన అన్ని ఫ్లాగ్‌లను చూపించి పిల్లల నుండి వివరాలు రాబట్టారు. అలాగే ప్రపంచ పటంలోని వివిధ దేశాల పేర్లను కూడా అడిగి తెలుసుకొని పిల్లలు ఈ సందర్భంగా అభినందిం చారు.
శిశు విహార్‌లో పిల్లల వివరాలు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సదు పాయాలు, ఆట వస్తువులు తదితర అంశాలపై సిబ్బందితో వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సం తోషి, ఈవోలు సవిత, తస్లీమా, నర్స్ అలివేలు, రూమ్ టీచర్లు, ఆయాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.