calender_icon.png 10 August, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

07-08-2025 06:27:24 PM

ఇల్లంతకుంట (విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను గురువారం ఏబీవీపీ(ABVP) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ తాటిపల్లి మహేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో సోదర భావం, జాతీయత, క్రమశిక్షణ పెంపొందించడం కొరకు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, సమాజంలో జరుగుతున్న అసాంఘిక శక్తులను ఎదుర్కొని చెడుకు దూరంగా ఉండాలన్నారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దేవరాజం, ఏబీవీపీ నాయకులు అక్కెం నాగరాజు, మంద వంశీకృష్ణ పలు పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.