calender_icon.png 10 August, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరం

07-08-2025 06:24:59 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమని మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ దబ్బేట రాజు(Municipal Sanitation Inspector Dabbeta Raju) అన్నారు. ప్లాస్టిక్ నివారణ, వినియోగంతో కలిగే నష్టాలపై గురువారం జిల్లా కేంద్రంలో పలు కిరాణ దుకాణాలు, హోటళ్ల యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్కడైనా వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్ ను వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు, జరిమానాలను విధించనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. టిఫిన్ సెంటర్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిల్ వాడాలని సూచించారు. కిరాణా, హోటల్ యజమానులు తప్పకుండా నిబంధనలను పాటించాలని లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్ ,ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.