28 August, 2026 | 4:49 PM

రేపు రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలు

28-08-2026 03:45 PM

నిర్మల్ ,ఆగస్టు 28, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం ఆత్యపాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్టు విరువకులు తెలిపారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని రాష్ట్రంలోని 31 జిల్లాల చెందిన క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియంలో మైదానాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు.