సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల ర్యాలీ
కార్మిక వ్యతిరేక నాలుగులేబర్ కోడ్‌లను, 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, కొమరం హనుమంతరావు
ఆళ్ళపల్లి, ఆగస్టు 10, (విజయక్రాంతి):కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సోమవారం మండల కేంద్రంలో అసంఘటిత కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, కొమరం హనుమంతు పాల్గొని మాట్లాడుతూ ,ప్రభుత్వం కార్మిక హక్కుల సౌకర్యాలపై దాడి చేస్తూ యజమానులకు ప్రయోజనం కలిగించే విధంగా. 2025 నవంబరు 21న 4లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చి 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది.
వీటివల్ల కార్మికులు, ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని జీతభత్యాలు పెరగక ఉద్యోగ భద్రత లేక సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. , కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ,నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐకెపి వివో ఏ. అంగన్వాడి ఆశ మిడ్ డే మీల్స్ వంటి కార్మికులపై పని భారం పడుతుందని 8 గంటల పని కి 12 గంటలకు పని భారం పెరుగుతుందని ప్రభుత్వ గౌరవ వేతనం రూ 18,500 నుండి రూ 26వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయడం వల్ల వ్యవసాయ. కార్మికుల ఉపాధి దెబ్బతింటుందన్నారు. నూతన విద్యా విధానం వల్ల విద్యారంగం పూర్తిస్థాయి కార్పొరేటీకరణ అవుతుందన్నారు. విద్యుత్ సవరణ బిల్లు వినియోగదారులపై భారం మోపటమే కాక ప్రభుత్వం విద్యుత్తు రంగం ప్రైవేట్ పరం అవుతుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలనీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐకెపి వివో ఏ మండల అధ్యక్షులు దొడ్డి రాము సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుగుణ. బోజమ్మ సుభద్ర.జయశ్రీ.శిరీష,పార్వతి సుభద్ర.కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.






