calender_icon.png 5 July, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి..

05-07-2025 01:39:54 AM

ఆనంద్‌బాగ్ నుంచి ర్యాలీగా వెళ్లిన మైనంపల్లి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ర్యాలీగా తరలివెళ్లారు. ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని పీవీఎన్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నుంచి కార్పొరేటర్ వై ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివెళ్లారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బాబు సత్యనారాయణ, సంపత్‌రావు, గుండా నిరంజన్, రాందాస్, సంతోష్ ముదిరాజ్, ఉపేందర్, బ్రహ్మయ్య, శంకర్‌రావు, మోహిన్, మౌసిన్ రాము పాల్గొన్నారు.