05-07-2025 01:41:09 AM
టీఎన్జీవోల కేంద్ర సంఘం డిమాండ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ దాడి చేయడం హేయమైన చర్య అని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ఖండించింది. వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సంచాలకుడు సురేంద్ర మోహన్ స్పందించి వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని టీఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు.
శుక్రవారం వారిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం టీఎన్జీ వోస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ హుస్సినీ ఆధ్వర్యంలో నిర్వహించగా.. సహా అధ్యక్షుడు వెంకటేశం, సెంట్రల్ యూనియన్ కార్యదర్శి సంతోష్, ముక్రం అధ్యక్షుడు, కార్యదర్శి చిలక నర్సింహరెడ్డి, సెంట్రల్ ఫోరమ్ బాధ్యులు అశోక్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, విజయ్ కిషోర్, రేవంత్, శ్రీకాంత్, రవికుమార్, హైదరాబాద్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు ఖలీద్, మురళి తదితరులు పాల్గొన్నారు.