05-07-2025 01:38:32 AM
13 మంది సభ్యుల నియామకం
విజయక్రాంతి నుంచి అశోక్‌కు అవకాశం
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలం గాణ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని రాష్ట్ర శాసనసభాపతి, శాసన మండలి చైర్మన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శాసనసభా సంయుక్త కార్యదర్శి సీహెచ్ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ఇండియన్ ఎక్స్‌ప్రెస్), కో చైర్మన్‌గా పోలోజు పరిపూర్ణాచారి (ఎన్‌టీవీ), సభ్యులుగా 13 మందిని నియమించారు.
కమిటీలో సభ్యుడిగా విజయక్రాంతి దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ సుంచు అశోక్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో ఐతరాజు రంగారావు (ఈనాడు), బొడ్లపాటి పూర్ణచంద్రరావు (ఆంధ్రజ్యోతి), లక్కడి వెంకట్‌రామిరెడ్డి (డెక్కన్ క్రానికల్), పోలంపల్లి అంజనేయులు (సాక్షి), ఎం పవన్‌కుమార్ (బిగ్ టీవీ), భీమనపల్లి అశోక్ (టీవీ9), బుర్ర అంజనేయులుగౌడ్ (వెలుగు), సురేఖ అబ్బూరి (ఇండియా టీవీ), మహమ్మద్ నయీం వజాహత్(ది సియాసత్), బసవపున్నయ్య (నవ తెలంగాణ), ప్రమోద్ కుమార్ చతుర్వేది(ఏఎన్‌ఐ), సుంచు అశోక్ (విజయక్రాంతి), బీహెచ్‌ఎంకే గాంధీ (డెక్కన్ క్రానికల్)లను సభ్యులుగా నామినేట్ చేశారు.