15-11-2025 02:12:10 PM
కొల్చారం: కొల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ వెల్మేకన్నే రాములు (55) గుండెపోటుతో మృతి చెందాడు. రాములు గత పది సంవత్సరాలుగా కిష్టాపూర్ గ్రామ పంచాయితీలో మల్టి పర్పస్ వర్కర్ గా గ్రామంలో తాగు నీటి సరఫరా పనులు నిర్వహిస్తున్నాడు. గ్రామస్థులతో కలుపుగోలుగా ఉండే రాములు మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం గౌడ్, మాజీ సర్పంచ్ గోదావరి తదితరులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా చూస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.