15-11-2025 02:08:57 PM
చిట్యాల,(విజయక్రాంతి): బీహార్ ఎన్నికల ఫలితాలలో బిజెపి అఖండ విజయం సాధించినందుకు గాను చిట్యాల మండల బిజెపి శ్రేణులు శనివారం సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాల వేడుకను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో 243 సీట్లకు గాను 202 స్థానాలలో గెలిచి అఖండ విజయం సాధించిందని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదంతో బీహార్ ఓటర్లను మభ్య పెట్టాలని చూసిన బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ అభివృద్ధి చూసి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినందుకు బీహార్ పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పట్టణ ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, కిసాన్ మోర్చా మాజీ అధికార ప్రతినిది చికిలంమెట్ల అశోక్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నె బోయన మహాలింగం, జిల్లా మాజీ కార్యదర్శి బోడిగే అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె వెంకన్న, బీజేపీ సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్ రెడ్డి, కన్నె బోయన మురళి కృష్ణ, దామరోజు నాగరాజు, పాలకూరి వెంకన్న సతీష్ పాల్గొన్నారు.