calender_icon.png 15 November, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంత మీడిసిపడితే ఎలా?.. ఇట్లనే విర్రవీగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తరు

15-11-2025 01:31:56 PM

హైదరాబాద్: ఒక్క ఎన్నికలోనే ఇంత మీడిసిపడితే తాము గతంలో ఎన్నో ఎన్నికలు గెలిచామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు దాటకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నాం, చాలా ఉప ఎన్నికల్లో గెలిచాము, ఎప్పుడు కాంగ్రెస్ ల మేము దాడులు చేయలేదని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు.

బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలిని కేటీఆర్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు, గూండా గిరి, డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచిందని ఆయన పేర్కొన్నారు. తాను అహంకారం తగ్గించుకోవాలన్నా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. 'నాది అహంకారమూ.. రేవంత్ రెడ్డిది అహంకారమూ.. ప్రజలు గమనిస్తున్నారు' అని కేటీఆర్ పేర్కొన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని విమర్శించారు. ఒక్క ఎన్నికలో గెలిస్తేనే ఇంత మీడిసిపడితే గతంలో మేము ఎన్ని ఎన్నికలు గెలిచామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.