calender_icon.png 25 November, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణం

25-11-2025 12:07:31 PM

ఉత్తరప్రదేశ్: అయోధ్యలో రామాలయం ధ్వజారోహణం(PM Modi Ayodhya Temple Flag Hoisting) వైభవంగా జరిగింది. ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాసాయపతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణం ధ్వజారోహణంతో సంపూర్ణమైంది. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్టు చిహ్నాలున్నాయి. జెండాపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా చిహ్నాలున్నాయి. అపూర్వ ఘట్టానికి 7 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. అయోధ్య బాలరాముడికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.