calender_icon.png 25 November, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్: ప్రధాని మోదీ

25-11-2025 01:16:54 PM

  1. అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణం
  2. కోట్లాది మంది రామభక్తుల కల సాకారం
  3. ధ్వజారోహణ కొత్త యుగానికి ప్రారంభం.
  4. దేశ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య నిదర్శనం
  5. అయోధ్య రామమందిరం 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్: అయోధ్యలో రామాలయం ధ్వజారోహణం(Ayodhya Ram Mandir) వైభవంగా జరిగింది. అయోధ్య రామాలయం శిఖరం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కాషాయ జెండాను ఎగురవేశారు. పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవున్న ఈ ధర్మ ధ్వజం ప్రకాశవంతమైన సూర్యుని ప్రతిమను కలిగి ఉంది, దానిపై కోవిదర చెట్టు చిత్రంతో పాటు 'ఓం' అనే గుర్తు చెక్కబడి ఉంది. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణం ధ్వజారోహణంతో సంపూర్ణమైంది. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అపూర్వ ఘట్టానికి 7 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రధాని మోదీ జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని తెలిపారు.

రామభక్తుల సంకల్పం సిద్ధించిందని చెప్పారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అయిందన్నారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదన్న మోదీ ఈ ధర్మధ్వజం భారతీయసంస్కృతి పునర్వికాసానికి, సంకల్పం, సఫలతకు  చిహ్నం అన్నారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని తెలిపారు. ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని పేర్కొన్నారు. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుందని ప్రధాని స్పష్టం చేశారు. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని, ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్య వస్తుందని పేర్కొన్నారు. కొట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని వెల్లడించారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందిరికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెప్తుందన్నారు. రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడని మోదీ సూచించారు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడికి భేద భావాలు ఉండడని తెలిపారు. శాతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించిందని వివరించారు. ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందని చెప్పారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీక అన్నారు.

మనచుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారని, బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దని సూచించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అన్న నరేంద్ర మోదీ శతబ్దాల క్రితమే భారత్ లో ప్రజాస్వామ్య విధానం ఉందన్నారు. తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని వివరించారు. భారత్ లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని, రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని బానిస భావజాలం ఉన్నవారు చెబుతున్న మాటలను మోదీ కొట్టి పారేశారు. వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షించారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా అవుతోందని0 చెప్పారు. అయోధ్య రాముడిని ఇప్పటికే 45కోట్ల మంది దర్శించుకున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.